Home  »  TV News  »  హాస్పిటల్ బెడ్ నుంచి 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' ఆడిషన్స్‌కు వెళ్లి సెల‌క్ట‌య్యింది!

Updated : Aug 18, 2021

 

'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' అంటూ ఇంతకు ముందు చేసిన స్కిట్స్ లో బెస్ట్ స్కిట్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఓ అరగంట ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి కొన్నిరోజులు ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ భాను యాంకరింగ్ చేసింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి సిరి హనుమంతు యాంకరింగ్ చేసింది. త్వరలో స్రవంతి చొక్కారపు కనిపించనుంది. 

స్రవంతి చొక్కారపు గతంలో మల్లెమాల షోలు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రెండు మూడు కార్యక్రమాలు చేసింది. ఇమ్మాన్యుయేల్ నచ్చాడని చేసిన స్కిట్ ఒకటి హిట్ అయ్యింది. అయితే, 'బెస్టాఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' చేసే అవకాశం అంత సులభంగా రాలేదని ఆమె ఓ పోస్ట్ పోస్ట్ చేసింది. ఆ కార్యక్రమానికి ఆడిషన్స్ ఇవ్వడానికి పిలిచినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదట. ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి రాసుకొచ్చింది. 

"కొన్ని రోజుల క్రితం అనుకోకుండా నా ఆరోగ్యం బాలేదు. కనీసం బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. 'బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్' కోసం ఆడిషన్ కి రావాలని. వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు. నా ముందు ఆ రోజు ఉన్న ఆప్షన్లు రెండే... రిస్క్ తీసుకోవడం, లేదంటే అవకాశాన్ని వదిలేయడం. మా ఇంట్లో వాళ్లంతా  'ఈ పరిస్థితిలో ఎందుకులే, వద్దు' అన్నారు. అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని అవకాశాలు వదిలేసుకున్నా. ఏదైతే అది అయ్యిందని, దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి ఆడిషన్ కి వెళ్లాను. 

తీరా అక్కడికి వెళ్ళాక... నాతో పాటూ  ఆరుగురు అమ్మాయిలు వచ్చారు. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. 'నేను అనవసరంగా వచ్చాను. కనీసం స్ట్రాంగ్ గా  నిలబడలేని పరిస్థితి' అని మనసులో అనుకొని వెళ్లి నిలబడ్డా. ఓ సాంగ్ ప్లే చేశారు. ఏదో రెండు స్టెప్స్ వేశా. మెల్లగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ సక్సెస్ ఫుల్ గా చెప్పేశా. అసలు, ఆ రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలుపెట్టింది. 'మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ?' అని. 'ఏం కాదులే. అంతా మంచే జరుగుతుంది' అన్నాను. 

తర్వాత ఇంటికి వెళ్లపోయా. నాకు రాదని రెండు రోజులు బాధపడ్డా. సడన్ గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. 'ఒకసారి ఆఫీసుకు రండి. సార్ మీతో మాట్లాడతారట' అని. వెళ్లాను. మాట్లాడాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. 'మీకు ఈ షో చేయటం ఇష్టమేనా? అని అడిగారు. 'ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు. కానీ, నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్'. మొత్తానికి రిస్క్ తీసుకోవడాన్ని నేను నమ్మాను" అని స్రవంతి చొక్కారపు తెలిపింది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.